end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంఛ.. మళ్లీ గ్యాస్‌ ధర పెంపు
- Advertisment -

ఛ.. మళ్లీ గ్యాస్‌ ధర పెంపు

- Advertisment -
- Advertisment -
  • ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగిన సిలిండర్‌ ధర

వంటగ్యాస్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ బాటలోనే గృహ వినియోగ సిలిండర్‌ ధరలు చమురు కంపెనీలు పెంచాయి. గురువారం నాడు సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కూడా తెలిపారు. పెరిగిన వంటగ్యాస్‌తో సిలిండర్‌ ధర రూ.794కు చేరింది. కేవలం ఒక ఫిబ్రవరి నెలలోనే గ్యాస్‌ ధర మూడు సార్లు పెరగడం గమనార్హం. ఫిబ్రవరి 4న రూ.25 పెంచగా, 15న మరో 50 రూపాయలు వడ్డించారు. కేవం ఒక నెల వ్యవధిలోనే రూ.100 పెంచడం చాలా దురదృష్టకరం. అసలే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే గృహవసరాల సిలిండర్‌ ధరను మూడు సార్లు పెంచడంతో ఊపిరాడడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడి ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. పెట్రో మంట చల్లారకముందే వంటగ్యాస్‌ ధరలు అమాంతంగా రూ.100 పెంచడంతో సాధారణ ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -