- దిగువకు నీరు విడుదల
- లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్ సాగర్ నిండింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జలాశయం మిగులు నీటిని దిగువకు వదిలారు. హుస్సేన్‌సాగర్ నిల్వ సామర్థ్యం 513.64 మీటర్లు. ఎగువ నుండి వరద ప్రవాహం ఎక్కువవుతుండడంతో జలాశయం పూర్తిగా నిండింది. అయితే ఇప్పటికీ ఏమి ప్రమాదం లేదని, కానీ దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. దోమలగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, అశోక్‌నగర్ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
( ధవళేశ్వరం బ్యారేజీకి భారీ వరదనీరు )