end
=
Wednesday, November 20, 2024
వార్తలురాష్ట్రీయంఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా
- Advertisment -

ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా

- Advertisment -
- Advertisment -
  • ఏపీ ప్రభుత్వం నిర్ణయం
  • విద్యార్థుల ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యత
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా విద్యార్థుల క్షేమాన్ని పరిగిణలోకి తీసుకొని ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ సంక్షోభ సమయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టలేమని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం కూడా సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మన ప్రాణాలు మన చేతుల్లోనే…!

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ కోవిడ్‌ కేసులు విజృంభిస్తున్నందున ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని అన్నారు. దేశంలో, రాష్ర్టంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తీరు చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఈ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అన్ని పరిస్థితులు సమీక్షించి పరీక్షలు వాయిదా వేయడం మంచిదని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే రాష్ర్టంలో పరిస్థితులు సద్దుమనిగాక, సాదారణ పరిస్థితులు వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -