end
=
Thursday, September 19, 2024
రాజకీయంకాంగ్రెస్‌లోకి ఈటెల రాజేందర్‌ ?!
- Advertisment -

కాంగ్రెస్‌లోకి ఈటెల రాజేందర్‌ ?!

- Advertisment -
- Advertisment -
  • కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కతో భేటి
  • తెలంగాణ రాష్ర్ట పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చ
  • ‘ప్రత్యేక తెలంగాణ లక్ష్యం’ కోసం కలసి పోరాటం చేద్దామన్న భట్టి
  • కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానం
  • ఈటెల సానుకూల స్పందన, సందర్భం కోసం ఎదురుచూపు

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ మంగళవారం నాడు కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటి అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవినుండి వైదొలిగిన ఈటెల ఇంకా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే పార్టీకి కూడా త్వరలో గుడ్‌బై చెప్పే సందర్భంగా కూడా వస్తోందంటున్నారు ఈటెల అనుచరులు. మంగళవారం నాడు కూడా ఈటెల రాజేందర్‌ లేకుండానే రాష్ర్ట కెబినెట్‌ సమావేశం జరిగింది. దీంతో సీఎం కేసీఆర్‌ ఈటెలను పూర్తిగా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్‌ రాజకీయంగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి రాజకీయ పరిస్థితులపై, తెలంగాణ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలిసింది.

అంతర్‌జిల్లా ప్రయాణానికి పోలీస్‌ ఈ-పాస్‌ తప్పనిసరి

కరోనా పరిస్థితులు చేయిదాటిపోయాయని, చాలా మంది ఊసురుమంటూ ప్రాణాలు కోల్పోతుంటే సీఎం కేసీఆర్‌ ఎటువంటి ప్రణాళిక లేకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌ అధిష్టానం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా అని భట్టి విక్రమార్క విమర్శించినట్లు తెలిసింది. తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరుగుతుందని, విద్య, ఉద్యోగ, నీళ్లు, నిధుల పట్ల అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆశిస్తే సీఎం కేసీఆర్‌ కేవలం తన కుటుంబ పాలకులకు, సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని దీనిపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం ఆసన్నమైనట్లు భట్టివిక్రమార్క, ఈటెల రాజేందర్‌ మాట్లాడుకున్నట్లు తెలిసింది.

తెలంగాణ లాక్‌డౌన్‌ – మినహాయింపులు

అయితే ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ పార్టీలోకి ఈటెల రాజేందర్‌ను సాదరంగా ఆహ్వానించినట్లు తెలిసింది. దీనికి ఈటెల సానుకులంగా స్పందిస్తూ సందర్భం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ర్ట రాజకీయాలలో సరికొత్త మలుపులు తిరగబోతున్నట్లు అవగతం అవుతోంది. ఈటెల రాజేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాబోయే ఎమ్మెల్యే/సీఎం ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు గట్టి పోటీ తప్పదు.

మన ప్రాణాలు మన చేతుల్లోనే…!

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -