end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంరూ.20 లక్షల హవాలా డబ్బు పట్టివేత
- Advertisment -

రూ.20 లక్షల హవాలా డబ్బు పట్టివేత

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు మల్కాజ్‌గిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు యాప్రాల్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సికిందరాబాద్‌ నుండి యాప్రాల్‌ వెళ్తున్న కారును తనిఖీ చేయగా రూ.20 లక్షలు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. కారు కూడా సీజ్‌ చేశారు. వారి వద్ద నుండి రెండు మొబైల్స్‌ కూడా స్వాధీనపరుచుకున్నారు. నిందితులను జవహర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -