- తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంస్కరణలు, అభివృద్ధిలో భాగం కావాలనే ఈ నిర్ణయం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపించారు. టీడీపీ పార్టీకి రాజీనామాకు గల కారణాలను ఆయన లేఖలో వివరించారు. తెలంగాణలో జరుగుతున్న సంస్కరణలు, టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు, అలాగే తెలంగాణ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో తెలిపారు. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధిలో తాను కూడా భాగం కావాలనే ఆకాంక్ష మేరకు తాను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
NALSAR యూనివర్సిటీలో ఎంబీఎ ప్రవేశాలు
అయితే గురువారం నాడు ఎల్.రమణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడరు. రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎంతో చర్చించానని, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.