end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంరేషన్‌ దుకాణాలు బంద్‌
- Advertisment -

రేషన్‌ దుకాణాలు బంద్‌

- Advertisment -
- Advertisment -
  • ఏపీలో రేషన్‌ డీలర్ల సంఘం నిర్ణయం
  • జీవో 10 కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌
  • ఒక్కో గోనె సంచికి రూ.20 ఇవ్వాలి

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు రేపటి నుండి(మంగళవారం) రేషన్‌ దిగుమతి, పంపణీ నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రేషన్‌ డీలర్ల సంఘం విలేకరుల సమావేశంలో తెలిపింది. 2020కి సంబంధించి పీఎంజీకేవై కమీషన్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సంఘం డిమాండ్‌ చేసింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ నుండి డీలర్లకు రావల్సిన మొత్తం బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. డీడీ, నగదు వాపసు, ధరల వత్యాసాలకు సంబంధించిన నిబంధనలను వెంటనే అమలు చేయాలని రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

జీవో 10 ప్రకారం గోనె సంచులను రూ.20 చొప్పును ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పక్క రాష్ర్టం తెలంగాణలో ఈ జీవో అమలులో ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గోనె సంచులను తిరిగిస్తే చెల్లింపు చేయమని చెప్పడం మంచిదికాదని డీలర్ల సంఘం నాయకులు తెలిపారు. అదేగాకుండా గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్‌చేసి కేసులు పెడతామని ఎంతవరకు సమంజసమని వారు వాపోయారు. జీవో 10ని పక్కాగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -