end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంకవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి
- Advertisment -

కవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి

- Advertisment -
- Advertisment -

మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి తీరని లోటు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయిన ఏలేశ్వరం నాగభూషణం ఆచారికి భార్య బాలమని, కుమార్తెలు అరుణ శ్రీ, మంజుల, కవిత, ఉషశ్రీ, కుమారులు నరేందర్, నవీను ఉన్నారు.

మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. ఏలేశ్వరం నాగభూషణం ఆచార్య ఇక్కడ విశేషం. , మంజీరా,, పసుపు లేరు నది ఒడ్డున గ్రామం ర్యాలమడుగు లో జన్మించడం. ఆయన జీవితాన్ని చైతన్య పరిచింది.

సి నారాయణ రెడ్డిని అబ్బురపరచిన ఏలేశ్వరం

మంజీరా రచయితల సంఘం సమావేశానికి వచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి ని, తెలుగు ప్రాచీన సాహిత్యంలో, వేలాది సంవత్సరాలు కవుల గురించి, ఆ పద్యాలను అనర్గళంగా కవితా గానం చేసిన ఏలేశ్వరం నాగభూషణ్ ఆచార్య, మేధస్సును సినారె రెడ్డి ప్రశంసించిన రోజులు గుర్తుకొస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంతాపం

ఏపీటీఎఫ్ అధికారిక మాసపత్రిక ఉపాధ్యాయ సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేసిన ఏలేశ్వరం నాగభూషణఆచార్య అనారోగ్యంతో మరణించడం చాలా విచారకరం. ఏపిటిఎఫ్ తెలంగాణకు విస్తరించడంలో వారు కృషి చేశారు వారికి టీచర్స్ ఫెడరేషన్ నివాళులర్పిస్తున్న ది. వారి మృతి వారి కుటుంబ సభ్యులకే కాక ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ఏపిటిఎఫ్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు అధ్యక్షులు కే. భానుమూర్తి,
ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వర ప్రసాద రావు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -