end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంఎంఐఎం అధినేత, ఎంపీ ఓవైసీ కారుపై కాల్పులు
- Advertisment -

ఎంఐఎం అధినేత, ఎంపీ ఓవైసీ కారుపై కాల్పులు

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌లో పాతబస్తీలో అందోళనలు
  • పాతబస్తీలో రాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌, కేంద్ర బలగాల మోహరింపు
  • ఎంపీ అససుద్దీన్‌ ఒవైసీకి జడ్‌ కేటగిరి సెక్యూరిటీ పెంపు

ఎంఐఐ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పాతబస్తీలో గందరగోళం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయి హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను దింపింది. శుక్రవారం ముస్లీం ప్రార్థనలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌–ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆందోళనలు మొదలైయ్యాయి. ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు దారుస్సాలంకు పరుగులు తీశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అససుద్దీన్‌ ఓవైసీకి భద్రత పెంచింది. జడ్‌ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్‌ కేటగిరీలో నలుగురు నుంచి ఆరుగురు NSG కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 22 మంది సిబ్బంది ఉంటారు. కాల్పుల సమయంలో అక్కడే ఉన్న యూపీ పోలీసులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని ఈసీని ఓవైసి కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -