- పల్లెవెలుగు బస్ ఛార్జీలను రౌండప్ చేసిన టీఎస్‌ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసి కీలకం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు బస్ ఛార్జీలను రౌండప్ చేసింది. రూ.12, రూ.13 ఇలా ఉన్నటువంటి ఛార్జీల వల్ల నిత్యం బస్ కండక్టర్లు, ప్రయాణీకులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు గతంలో హైదరాబాద్‌లో అమలుపరిచిన మాదిరిగానే ఇకపై జిల్లాలలో తిరిగే పల్లె వెలుగు బస్సు ఛార్జీలు రౌండప్ చేశారు. ఈ విధానం నేటి నుండే అమల్లోకి వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రూ.12 బస్సు టికెట్ ధరను రూ.10కి తగ్గించారు. రూ.13, రూ.14 బస్ చార్జీలను రూ.15గా రౌండప్ చేశారు. కాగా 80 కిలోమీటర్ల దూరానికి బస్ ఛార్జీ రూ.67 ఉండగా దానిని రూ.65గా మార్చారు. అయితే టోల్‌ప్లాజాలా వద్ద ఆర్డినరి బస్‌కు రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు.