గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత వారం పది రోజుల నుండి దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో దాదాపు అన్ని రాష్ర్టాలలో అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఉన్న పెద్ద, చిన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్ని నిండిపోయాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి గ్రామాలు మునిగిపోయాయి. పట్టణాలు సైతం వరద నీటిలో నిర్భందించబడ్డాయి. అయితే ఈ వర్షాల ప్రభావంతో భూగర్భ జలాలు కూడా చాలా పెరిగాయి. పుష్కలంగా నీరు చేకూరింది. దీంతో ములుగు మండలం శివతండాలో ధరవత్ అనే రైతు పోలంలోని తన బోరు బావిలోంచి నీరు పైకి ఉబికి వస్తోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు క్యూ కట్టారు. ఏదేమైనా ఈ సారి వర్షాలకు, నీటికి, పంటలకు ఎటువంటి ఢోకా లేదు.
( యాచకుడు అయితేనేం… మానవత్వంలో మారాజు )