ప్రాణం ఉన్నా నిశ్చలంగా ఒకేచోట చైతన్యం లేకుండా ఉండడం బల్లి లక్షణం. మనుషుల్ని బంధించి, సంకెళ్లు వేసి కదలనివ్వకుండా చేసి పైశాచిక(Satanic) ఆనందం అనుభవించిన గోధ అనే రాజు శాపానికి గురై బల్లిగా పుట్టాడు. మహాపాపాలు చేసినందువల్ల బల్లి జన్మ వచ్చింది. కాబట్టి దాన్ని తాకకుండా జనులందరూ అసహ్యించుకున్నారు. శాపగ్రస్థమై, పాపఫలాన్ని అనుభవిస్తున్న బల్లిని తాకితే ఆ పాపాలు అంటుకుంటాయని జనుల నమ్మకం. బల్లిపాటు దోషాల కారణమైతుందని నమ్ముతారు. బల్లిపాటు దోషాలనుండి విముక్తి(Emancipation) కోసం కంచిలో బంగారు, వెండి బల్లులను తాకుతారు.
తలపై కాకి తన్నితే కీడు జరుగుతుందా?
కాకతాళీయంగా, యథాలాపంగా కాకి తన్నితే చింత పడకండి. శివాలయానికి వెళ్లి శివ దర్శనంతో ఆ దోషం దూరమౌతుంది. తృప్తి కలగకపోతే శివాభిషేకం చేయించుకోండి. కాకి తాకిడికి పరిహారం చేసుకోండి. నువ్వులు, అన్నం సమానంగా కలిపి విస్తరిలో వడ్డించండి. పితృదేవతలకు(To the patriarchs) నైవేద్యంగా సమర్పించి నమస్కరించండి. ఆ నైవేద్యాన్ని కాకులు ఆరగిస్తాయి.