end
=
Thursday, November 28, 2024
వార్తలురాష్ట్రీయంవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ ఆత్మహత్య
- Advertisment -

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -
  • ఆర్థిక ఇ్బందులతో సతమతం
  • విషపు గుళికలు మింగిన భాస్కర్‌రెడ్డి

ఆర్థిక ఇబ్బందులతో వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిపత్రి పురపాలకంలో జరిగింది. 14వ వార్డు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి(52) ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఆదివారం రాత్రి విషపు గుళికలు మింగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భాస్కర్‌రెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింతగా విషమించడంతో అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతను బతకలేకపోయాడు. సోమవారం ఉదయం ఆయన మృతి చెందారు. భాస్కర్‌రెడ్డికి భార్య లక్ష్మీదేవి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసీ ప్రభాకర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కాగా పలువురు వెస్‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -