end
=
Saturday, September 21, 2024
బిజినెస్‌రియల్‌ రంగంలోటీడీఆర్‌ శకం
- Advertisment -

రియల్‌ రంగంలోటీడీఆర్‌ శకం

- Advertisment -
- Advertisment -

టీడీఆర్‌.. టాన్స్‌ఫరెబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌.. నిర్మాణ రంగంలో ఒక వినూత్న విధానం. హైదరాబాద్‌ రియల్‌ రంగం.. ఇప్పుడు టీడీఆర్‌ శకానికి నాంది పలికింది. నిర్మాణ హక్కుల బదిలీకి సంబంధించిన టీడీఆర్‌ సర్టిఫికెట్లకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతున్నది. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహంతోపాటు ప్రైమ్‌ ఏరియాల్లో ఎంత ధరైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. స్థలాల లభ్యత లేకపోవడం తదితర కారణాలతో టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతున్నది. గత దశాబ్దకాలంలో రోడ్డు విస్తరణల్లో భూములు కోల్పోయినవారికి జీహెచ్‌ఎంసీ కేవలం 115 టీడీఆర్‌లు మాత్రమే జారీచేసింది. కానీ, గత ఏడాది 323, ఈ ఏడాది ఇప్పటివరకు 150కిపైగా టీడీఆర్‌లు జారీచేయడమే వాటికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ద్వారా 150కిపైగా టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీ అయ్యాయంటే వాటి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -