- ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 20 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కేవలం మెడికల్ అత్యవసరాల కోసం అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక పాఠశాలలకు మే 6 నుండి జులై 3 వరకు వేసవి సెలవులు ప్రకటించింది ఏపీ విద్యాశాఖ. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. జూలై 4 నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నట్లు వివరించారు. మే 20 తర్వాతనే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ తెలిపింది.