కోవిడ్ 19 వల్ల ప్రపంచమంతా తల్లడిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వల్ల ప్రాణాలతో పాటు ఎంతో మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఈ ప్రభావం చిత్రసీమ, సినిమాహాళ్ల మీద కూడా పడింది. అయితే ఈ ఆగస్టు చివరి వారంలో అన్‌లాక్ 3.0 ముగియనుంది. సెప్టెంబర్ నుండి అన్‌లాక్ 4.0 ప్రారంభంకానున్నట్లు సమాచారం. అయితే ఈ అన్‌లాక్ 4.0లో సినిమాహాళ్లు తెరుచుకోబోతున్నట్లు, ఇందుకు సంబంధించిన కోవిడ్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
సామాజిక దూరం, సీట్ల మధ్య దూరం, ప్రతి షో తర్వాత పూర్తి శానిటైజేషన్, హాలు ఉష్ణోగ్రత తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే మల్టీప్లెక్స్‌లపై ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని సమాచారం. ఏదేమైనా ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ నిర్భంధం, వ్యక్తుల మధ్య దూరం పాటిస్తేనే అందరికీ మంచిది. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఎక్కువ.