end
=
Monday, January 20, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌మడ్‌ప్యాక్‌తో ముఖం కాంతివంతం
- Advertisment -

మడ్‌ప్యాక్‌తో ముఖం కాంతివంతం

- Advertisment -
- Advertisment -

ముఖంపై మచ్చలు పోయి అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం రకరకాల క్రీమ్స్ ఫేషియల్స్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ మట్టిని ఉపయోగించి మొహం పై ఉండే మచ్చలు మలినాలు అన్నీ పోగొట్టుకొని ముఖం అందంగా కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ లో చాలా డబ్బులు ఇచ్చి మరీ మనం మడ్ ప్యాక్ వేయించుకుంటూ ఉంటాము. బ్యూటీ పార్లర్ వాళ్ళని చూసి కాపీ కొట్టి నాచురో పతి వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని అనుకుంటారు కానీ ఏది ముందు ఉంచి నాచురో పతి లో ఉంది.

ఈ మడ్ ప్యాక్ కోసం ఊరు నుండి నల్లమట్టి తెప్పించుకొని బండతో బాగా కొట్టుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. మెత్తగా అంటే బియ్యం పిండి లాగా ఉండేలా చూసుకోవాలి. జల్లించిన మట్టిని మళ్ళీ ఎండబెట్టాలి. ఎండ పెట్టిన మట్టిని ఏదైనా జిప్ లాక్ బ్యాగ్లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక గిన్నె లో తీసుకొని చల్లని నీరు వేసి 3 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నాన పెట్టిన మట్టిని కళ్ళు, ముక్కు మరియు పెదవులు ధగ్గర వదిలేసి ముఖమంతా అప్లై చేసుకోవాలి. 25 నుంచి 45 నిమిషాల పాటుగా బాగా ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని రుద్ధుతూ కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.మొటిమలకు కారణం అయ్యే వైరస్ ను నాశనం చేస్తుంది. నల్లని మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -