end
=
Monday, September 23, 2024
వార్తలురాష్ట్రీయంఎం‌ఎం‌టి‌ఎస్ ప్రయాణికులకు ముఖ్యగమనిక:
- Advertisment -

ఎం‌ఎం‌టి‌ఎస్ ప్రయాణికులకు ముఖ్యగమనిక:

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జూన్ 12(ఆదివారం) రోజున 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12న(ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో మొత్తం 9 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దయ్యాయి. ఈ మార్గంలో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.ఫలక్ నూమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు రద్దయ్యాయి. ఈ మార్గంలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల రైళ్లు ఉన్నాయి. లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులను రద్దు చేశారు అధికారులు. ఇందులో 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల రైళ్లు ఉన్నాయి.

అయితే ఆర్‌ఆర్బీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఐదు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, సెలవు రోజు వస్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -