end
=
Friday, November 22, 2024
క్రీడలుఎవరికీ భయపడని దాదా.. హ్యాప్పి బర్త్డే గంగూలీ.
- Advertisment -

ఎవరికీ భయపడని దాదా.. హ్యాప్పి బర్త్డే గంగూలీ.

- Advertisment -
- Advertisment -

టీమిండియా మాజీ కెప్టెన్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం 50వ పుట్టిన రోజు. అయితే, పుట్టినరోజు వేడుకలు మాత్రం ఒకరోజు ముందుగానే మొదలైపోయాయి. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, ఒకప్పటి సహచర ఆటగాడు, టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో కలిసి గంగూలీ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నాడు. క్రీడాకారులు ఎప్పుడూ ఆట వల్ల పొందే హోదా, దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నామనే గౌరవం కోసం ఆడుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. కేవలం డబ్బుల కోసం ఎవరూ ఆడరని తెలిపాడు.

సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంగూలీ భారత కెప్టెన్‌గా విజయవంతమయ్యాడని, అతను ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, అతని అయిదేళ్ల పదవీ కాలంలో భారత క్రికెట్ దశ దిశా ఎంతో మారిందని పేర్కొన్నాడు. ఇక గంగూలీ హయాంలో అతను ఇంగ్లాండ్‌లో ప్రసిద్ధ 2002నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2003 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. ఇక టెండూల్కర్, గంగూలీ ఎన్నో మ్యాచుల్లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

గంగూలీ జో రూట్‌ను ఆల్ టైం గ్రేట్ ప్లేయర్‌గా కీర్తించడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిసి) 17000పరుగుల మార్క్ చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 118 మ్యాచ్‌లు ఆడిన రూట్ 26 సెంచరీలతో 10015పరుగులు చేయగా.. వన్డేల్లో 152 మ్యాచ్ లు ఆడిన రూట్ 16సెంచరీలతో 6109పరుగులు చేశాడు. ఇక పొట్టి ఫార్మాట్లో 32 మ్యాచ్‌లు ఆడిన రూట్ 5హాఫ్ సెంచరీలతో 893పరుగులు చేశాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -