end
=
Thursday, November 21, 2024
వార్తలుహైదరాబాద్‌లో మరో మోసం...
- Advertisment -

హైదరాబాద్‌లో మరో మోసం…

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్ నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. వత్తుల తయారీ పేరుతో ఓ సంస్థ సుమారు రూ.20కోట్ల మేర డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. గుప్త నిధులు, సులభంగా డబ్బు సంపాదన మార్గం, ప్రభుత్వోద్యోగాల పేరుతో కొందరు, కరక్కాయలు పొడి చేసి ఇస్తే భారీగా డబ్బిస్తామంటూ మరికొందరు ఇలా ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న కేటుగాళ్లు ఎందరో అయితే ఇన్ని మోసాలు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రాకపోవడంతో మోసగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో మరో ఘరానా మోసం బయటపడింది. ఏబీజీ అనే సంస్థ వత్తుల తయారీ పేరిట భారీగా డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని నమ్మబలికిన సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షల చొప్పున డిపాజిట్‌ సేకరించింది. కిలో దూది రూ.300 చెల్లించి తీసుకుని వత్తులు తయారు చేసి ఇస్తే రూ.600 చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకుంది. ఆరు నెలల తర్వాత డిపాజిట్ డబ్బులు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మిన చాలామంది డిపాజిట్లు కట్టి స్కీమ్‌లో చేరారు. మొదటి నెల సక్రమంగా డబ్బులు ఇచ్చిన సంస్థ రెండు నెలలకే బోర్డు తిప్పేయడంతో ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీజీ కంపెనీ సుమారు 600 మంది నుంచి రూ.20కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఏబీజీ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -