end
=
Sunday, September 22, 2024
వార్తలురాష్ట్రీయంశ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
- Advertisment -

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisment -
- Advertisment -
  • ప్రమాద స్థలిలో 25 మంది ఉద్యోగులు
  • సొరంగమార్గం ద్వారా బయటపడ్డ 15 మంది
  • చిక్కుకుపోయిన మిగతా 10 మంది ఉద్యోగులు

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమ్రబాద్‌ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు వైపు ఉన్న జలవిద్యుత్‌ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరగగనే దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు సొరంగ మార్గం ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 15 మంది మాత్రం సొరంగ మార్గం నుంచి బయటపడ్డారు. కానీ మిగతా 10 మంది అక్కడే చిక్కుకొనిపోయారు. దట్టమైన పొగల కారణంగా మిగతా సిబ్బంది ఎక్కడ చిక్కుకొనిపోయారనేది తెలియడం లేదు.

డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్‌, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు – గేట్లు ఎత్తివేత

ఈ ప్రమాదం వల్ల నాలుగు ప్యానెల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్‌, పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే దట్టమైన పొగ కమ్ముకొని ఉండడం వల్ల లోపల పరిస్థితి ఏమి అర్థం కావడం లేదని, ఆక్సిజన్‌ పెట్టుకొని వెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -