end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయం14 జిల్లాల్లో ఇంకా అందని జీతాలు!!!
- Advertisment -

14 జిల్లాల్లో ఇంకా అందని జీతాలు!!!

- Advertisment -
- Advertisment -

తెలంగాణ లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అయోమయం లో పడింది. జులై నెల 12వ తారీఖు దాటినా వారికి ఇంకా జీతాలు పడకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా మంగళవారం నాటికి 19 జిల్లాల ఉపాధ్యాయులకు జీతాలు పడ్డాయి. మొదటి వారంలోనే కొన్ని జిల్లాల ఉద్యోగులకు జీతాలు పడగా మంగళవారం సిద్దిపేట, నిర్మల్‌, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల ఉపాధ్యాయుల ఖాతాల్లో వేతనాలు వేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, కామారెడ్డి, వరంగల్‌ తదితర 14 జిల్లాల్లో జీతాలు ఎప్పుడు అందుతాయో తెలియడంలేదని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అయిన జీతం కోసమే పనిచేస్తారు కదా ఎందుకు ఈ ఎదురు చూపులు అని బాదాపడుతున్నారు. జూన్ నెలలో 25వ తేదీ తర్వాత జీతాలు రావడంతో ఈసారి కూడా నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందేనని వారు ఆవేదన పడుతున్నారు.

ప్రభుత్వం సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో లోన్ ఈఎంఐల, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక అవమానాల పాలు కావాల్సి వస్తోందని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీతాలు రాని టీచర్లంతా ఇదే విషయమై టెన్షన్‌లో ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -