end
=
Tuesday, January 21, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంMosquitoes: దోమలకి చెక్ పెట్టండి ఇలా...
- Advertisment -

Mosquitoes: దోమలకి చెక్ పెట్టండి ఇలా…

- Advertisment -
- Advertisment -

Mosquitoes: వర్షాకాలంలో(Monsoon Season) మన ఇంటికి వచ్చే బందువుల్లో దోమ ఒకటి అవునా కదా మీరే చెప్పండి. అయితే వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. వర్షాకాలం స్టార్ట్‌ అయ్యిందంటే దోమల కి సీజన్‌ మొదలైందని అర్థం..సాయంత్రమైందంటే చాలు మనపై యుద్ధం చేస్తాయి. కుట్టి కుట్టి (Mosquito Bytes) రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అంతటితో అయి పోతుందా.. లేనిపోని రోగాలను కూడా అంటిస్తాయి. దోమలు కుట్టడం వల్ల ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, చికున్‌గున్యా, మలేరియా, డెంగీ వంటి విషజర్వరాలు (Viral Fever) వ్యాపిస్తాయి. కొన్ని రకాల దోమలు కుడితే బొబ్బలు కట్టి విపరీతమైన మంట ఇబ్బందిపెడుతుంది. దోమలను తరిమికొట్టడానికి ఆల్‌ అవుట్‌లు(All Out), మస్కిటో కాయిల్స్‌‌ (Mosquito Coils) మస్కిటో రిపెల్లెంట్‌ వంటివి వాడూతూ ఉంటారు. వీటి ప్రభావం దోమలపై ఎలా ఉన్నా మన ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్లో దొరకే కెమికల్‌ ప్రొడెట్స్ కంటే మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలతోనే దోమల బెడద నుంచి విముక్తి పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

కర్పూరం (camphor)..

కర్పూరం దోమలను తరిమికొట్టడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. ప్లేట్లో కొంచెం కర్పూరం(Camphor) తీసుకుని గదిలో పెట్టండి. గది తలుపులు, కిటికిలూ మూసి ఒక అరగంట పాటు అలానే ఉంచండి. ఈ వాసకు దోమలు పారిపోతాయి. లేదా టికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే దోమలు ఇంట్లోకి రావు. ఒకవేళ వేప ఆకులు లేకపోతే కర్పూరంతో పొగ వేసినా దోమలు ఎలా వస్తాయో అలాగే పారిపోతాయి. (కర్పూరంతో ఆరోగ్య లాభాలు)

వెల్లుల్లి (Garlic) ..

అందరి వంట గదిలో దొరికే వెల్లుల్లి. దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీళ్ళను ఒక బాటిల్ తీసుకొని ఇంట్లో స్ప్రే చేయండి. ఇలా చేస్తే దోమలు తుర్రుమంటాయి. (Garlic : వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…)

నిమ్మకాయ(lemons), లవంగాలు(Clove)..

నిమ్మకాయలను సగానికి ముక్కలుగా చేసి వాటిలో కొన్ని లవంగాలను పెట్టండి. ఈ టెక్నిక్‌తో దోమలు మీ ఇంట్లోకి రావడానికి భయపడతాయి. వీటిని ప్రతి గదిలో ఉంచండి మీ ఇంటిలో దోమల బెడత నుండి తపించుకోవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -