end
=
Tuesday, November 26, 2024
వార్తలురాష్ట్రీయంఏపీకి రెయిన్ అలర్ట్..
- Advertisment -

ఏపీకి రెయిన్ అలర్ట్..

- Advertisment -
- Advertisment -

కొద్దిరోజులుగా ఏపీలో చెదురుమదరుగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావణశాఖ హెచ్చరించింది. కృష్ణా, గోదావరి నదులకు వరదపోటు. ఒడిశా తీరంలో అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది నాలుగైదు రోజుల పాటు అల్పపీడనంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తులో విస్తరించి ఉంటుంది. ఈ ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వానలు కురిశాయి. రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాలపై వర్షాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 23.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరడటంతో ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. దేవీపట్నం, కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో చాలా గ్రామాలు నీళ్లలో చిక్కుకుపోయాయి. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పలు గ్రామాల నుంచి 1,125 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధవళేశ్వరం దగ్గర మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం 11 గంటలకు బ్యారేజి వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. పోలవరం స్పిల్‌వే దగ్గర మంగళవారం సాయంత్రానికి 34.25 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. 48గేట్ల నుంచి 12.37లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతుండగా.. ఇప్పటివరకు ఇదే అత్యధిక వరదని అధికారులు చెబుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -