end
=
Wednesday, November 20, 2024
బిజినెస్‌తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ బైక్స్
- Advertisment -

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ బైక్స్

- Advertisment -
- Advertisment -

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసిన బైక్, స్కూటి ఉండటం చాలా సహజం. అలాంటిది మనం చూసుకునేది ఎంటి అంటే తక్కువ కర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి చూసుకుంటాం కదా. అలాగే బెస్ట్ మైలేజ్ బైక్స్ కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే మీరు ఈ విషయలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీల మోడళ్లు అధిక మైలేజ్‌ను అందిస్తున్నాయి. కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఏ బైక్ కొనాలో తెలియడం లేదా? పికప్ బాగుండి, రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోయే బైక్ కన్నా ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూవీలర్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.

అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్‌ను పలు కంపెనీలు మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. యువత కన్నా పెళ్లైన వారికి ఇలాంటి బైక్స్ సౌకర్యంగా ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే భార్య, పిల్లలతో కలిసి వెళ్లాలంటే అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్‌తోపాటు కూర్చోడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీటి ధర కూడా సామాన్యునికి అందుబాటులోనే ఉంది. అందువల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. చేతిలో డబ్బులు లేకపోతే బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్ తీసుకొని టూవీలర్ కొన్నా కూడా తక్కువ ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడు ఇలాంటి అధిక మైలేజ్ బైక్ కొనాలని అనుకుంటే.. ఏ ఏ కంపెనీ బైక్స్ ఎలాంటి మైలేజ్ ఇస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో ఎక్కువగా బజాజ్, టీవీఎస్, హీరో టూవీలర్లు ఉంటాయి.

బజాజ్ సీటీ 110ఎక్స్

అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో బజాజ్ కంపెనీ టూవీలర్లు మొదటి స్థానం లో ఉంటాయి. ఈ కంపెనీ రూపొందించిన బజాజ్ సీటీ 110ఎక్స్ ఎక్కువ మైలేజ్ ఇస్తోంది. దేశంలోని బెస్ట్ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ బైక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ బైక్ లీటరుకు 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు. ఇందులో 115 సీసీ డీటీఎస్ఐ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 66,000 నుంచి ప్రారంభం అవుతోంది. గంటకు 90 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ రావొచ్చు.

టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ బైక్ కూడా బెస్ట్ మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్స్ జాబితాలో ఉంది. ఈ బైక్ సుమారుగా 75 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వొచ్చు. నెంబర్ 1 ఆన్ రోడ్ మైలేజ్ బైక్ గా కంపెనీ పేర్కొంటోంది. పలు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. బరువు కూడా తక్కువ ఉంటుంది. ఇందులో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఈటీఎఫ్ఐ టెక్నాలజీ 110 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. ధర రూ. 67,000 నుంచి ప్రారంభం అవుతోంది.

బజాజ్ ప్లాటినా 110

బజాజ్ కంపెనీకి చెందిన మరో మోడల్ ప్లాటినా కూడా అధిక మైలేజ్ ఇస్తోంది. ఈ బైక్ కూడా 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు. దీని రేటు రూ. 69,500 నుంచి ప్రారంభం అవుతోంది. ఇందులో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 115 సీసీ ఇంజిన్ ఉంటుంది. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ఈ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

హీరో కంపెనీకి చెందిన హెచ్‌ఎఫ్‌ డీలక్స్ కూడా అధిక మైలేజ్ ఇస్తోంది. ఈ బైక్‌లో సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 97.2 సీసీ ఇంజిన్. కంపెనీ మాత్రం ఈ బైక్ లీటరుకు 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వచ్చు. దీని రేటు రూ. 60 వేల నుంచి ప్రారంభం అవుతోంది. వేరియంట్ ప్రాతిపదికన ధరల్లో మార్పు ఉంటుంది. అలాగే ప్రాంతం ప్రాతిపదికన బట్టి రేటు వేరువేరు గా మారుతు ఉంటుంది.

ఇకపోతే బైక్ మైలేజ్ అనేది చాలా అంశాల ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. మీరు బైక్ డ్రైవ్ చేసే విధానం, స్పీడ్, రోడ్లు, వెహికల్ మెయింటెనెన్స్ వంటి అంశాలు మైలేజ్‌పై చాలా ప్రభావం చూపుతాయి. పైన పేర్కొన్న బైక్స్ అన్నీ 100 కిలోమీటర్లకు పైనే మైలేజ్ ఇస్తాయని కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఆన్‌రోడ్ విషయానికి వస్తే మైలేజ్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఏ బైక్ అయితే కొనాలని అనుకుంటున్నారో అప్పుడు ఆ బైక్ నడిపే వారిని అడిగి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -