end
=
Wednesday, January 22, 2025
రాజకీయంఈ ఫొటోతో కేటీఆర్ సమాధానం ఇవ్వకనే ఇచ్చారు.
- Advertisment -

ఈ ఫొటోతో కేటీఆర్ సమాధానం ఇవ్వకనే ఇచ్చారు.

- Advertisment -
- Advertisment -

రామారావు ఆన్ డ్యూటీ అంటూ కేటీఆర్ ఫైళ్లను పరిశీలిస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ఇంట్లో నుంచే ముఖ్యమైన పనులు చేస్తున్నారు. ఈ ఫొటోకు రామారావు ఆన్ డ్యూటీ అనే ట్యాగ్ లైన్ తగిలించడంతో అది నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఓటీటీలో సినిమాలు చూడటం కాదు రాష్ట్రంలో ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుండి ప్రజలకి సందించిన పని చేయొచ్చుకదా అన్న షర్మిల లాంటి నేతలకు ఈ ఫొటోతో కేటీఆర్ సమాధానం ఇవ్వకనే ఇచ్చారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా వీరి బాటలో చేరారు. కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ముఖ్యమైన పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫైల్ వర్క్ పూర్తి చేస్తున్నానంటూ బనియన్, షార్ట్ ధరించి సోఫాలో కూర్చున్న ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు.

మంత్రి ఫొటోను నెటిజన్లు ఫన్నీగా ఎవరి ఇష్టం ఉన్నట్టు వారు వాడేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఫొటోకు రామారావు ఆన్ డ్యూటీ అనే క్యాప్షన్ తగిలించారు.

హైదరాబాద్ తో సహా ఇతర పట్టణాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీంతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో కలిసి పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఐఏఎస్‌ను కేటీఆర్ ఆదేశించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -