జులై 29 నుంచి ఆగస్టు 27 వరకూ శ్రావణమాసం. శ్రావణమాసం మెుదటి వారంమే శ్రావణ శుక్రవారం(First Friday) కావడం విశేషం. భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం నెల మొదలైంది. హిందువులంతా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీ మహా విష్ణువు(Sri Maha Vishnu) జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది కూడా శ్రావణ మాసంలోనే. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. ముఖ్యంగా మహిళలు ఈ మాసంలో నోములు(Nomu), వ్రతాలు, పూజలు చేస్తారు. ఈ ఏడాది శ్రావణంలో 5 సోమవారాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. ఆగస్టు 2న నాగపంచమి, ఆగస్టు 11న రక్షాబంధన్(Rakshabandhan) పండుగలు ఉన్నాయి. ఈ రెండు మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగలే.

శుక్రవారం చాలామందికి అనేక విషయాలకు సెంటిమెంట్(Sentiment) గా ఉంటుంది. శుక్రవారాన్ని అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తాము. అలాంటిది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు మరింత పవర్ ఉంటుందని విశ్వసిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. అమ్మవారికి పూజకు అందుకే ప్రత్యేక స్థానం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణమాసం ప్రతి ఇంట్లోనూ శుభాలనిచ్చే(Good Luck) మాసమని చెప్పాలి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మహిళలకు ఎంతో ప్రత్యేకమైనవిగా చెబుతారు. ఉదయాన్నే లేచి, వాకిళ్లు శుభ్రం చేసి, గడపలు పూజించి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి అమ్మవారిని అత్యంత భక్తి(Devotion) శ్రద్ధలతో పూజ చేస్తారు. ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెరవేరతాయని, జీవితం సంతోషంగా ఉంటుందని మహిళలు ధృడంగా విశ్వసిస్తారు. అందుకే ఈ మాసం ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు అందంగా రెడీ అయ్యి వర మహాలక్ష్మిని(Goddess Laxmi) పూజిస్తారు.
శుక్రవారం(Friday) నాడు ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఒట్టి చేతులతో పంపించ కూడదు అని శాస్త్రం చెబుతోంది. ఇంటికి వచ్చిన వారిని దైవ స్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టి, ఫలాలను ఇచ్చి, ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక శుక్రవారం నాడు నోరు లేని మూగ జీవాలను కొట్టరాదు. నోరు లేని మూగ జీవాలకు, నిరుపేదలకు(Poor) తమ వంతు సహాయం అందిస్తే లక్ష్మీదేవి కృప ఖచ్చితంగా వారిపై ఉంటుంది.
(Flowers:అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?)