end
=
Sunday, November 24, 2024
వార్తలురాష్ట్రీయంప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు
- Advertisment -

ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు

- Advertisment -
- Advertisment -

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖలు విద్యుత్ బకాయిలు ఎగ్గొడుతున్నాయి. నాలుగు ప్రభుత్వ శాఖలు కలిపి ఏకంగా రూ.17వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. సామాన్య ప్రజల నుంచి వెంటపడి బిల్లులు వసూలు చేసే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వంలోని వివిధ శాఖలు షాకిస్తున్నాయి. డిస్కంల నుంచి పెద్దమొత్తంలో కరెంటు వాడుకుని బిల్లులు కట్టకుండా ఇబ్బంది పెడుతు సతాయిస్తున్నాయి. దీంతో డిస్కంలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.

(చదవండి : తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు)

నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలతో పాటు వాటర్‌ బోర్డు విభాగాలు డిస్కంలకు ఏకంగా రూ.17 వేల కోట్ల కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సామాన్య ప్రజలు వరుసగా మూడు నెలలు బిల్లు కట్టకపోతే విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరా నిలిపివేసి వారిని ముప్పు తిప్పలు పెట్టి దగర ఉండి మరి కట్టిస్తారు కదా. సామాన్య ప్రజలకి ఒక న్యాయం ప్రభుత్వ శాఖల వారికి మరో న్యాయం. అయితే ప్రభుత్వానికి చెంగిన వివిధ శాఖల నుంచి రూ.వేల కోట్ల బిల్లులు రావాల్సిన ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు నోరు కదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -