end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంమధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
- Advertisment -

మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisment -
- Advertisment -

మధ్యప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌లోని ఓ న్యూలైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇంకేదైనా కారణంగా జరిగిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -