కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లను భౌతికంగా తెరవవద్దని తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల విద్యాశాఖలు కేంద్ర విద్యాశాఖను కోరినట్లు తెలిసింది. అయితే పాఠశాలలు తెరవలా వద్దా అనే అంశంపై పూర్తి స్థాయి అభిప్రాయం పిల్లల తల్లిదండ్రుల మీద ఉందని, వారి సానుకూల అభిప్రాయం తర్వాతనే స్కూళ్లు తెరబడతాయని రాష్ర్టాల విద్యాశాఖలు కోరనిట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష
అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే తమ పిల్లలను బడులకు పంపించనున్నట్లు కేంద్ర విద్యాశాఖకు రాష్ర్ట విద్యాశాఖ అధికారులు నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఈ నెల 19న కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారి సైతం అదే అభిప్రాయం ఏకీభవించినట్లు తెలిసింది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించడానికి తగిన వసతులు లేకపోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.