రూపాయి విలువ పతనం అయినప్పటినుండి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం. గడిచిన నేలరోజుల్లో మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ రూ.80కి పడిపోయిన తర్వాత బంగారం, వెండి ధరలు అనూహ్యంగా మారుతున్నాయి.
24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 తగ్గి, తులం రూ.51,380గా ఉంది. వెండి ధర రూ.400 తగ్గి, 1కేజీ రేటు రూ.58,000కు దిగొచ్చింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి.గడిచిన వారం రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.810 మేర పెరగ్గా, ఇవాళ రేటు తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం వారానికిపైగా పతనం దశలోనే ఉంది. నేటి తగ్గుదలతో కలిపి ఏకంగా రూ.4,300 మేర రేటు తగ్గింది. హైదరాబాద్ లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి తులం (10 గ్రాములు) రూ.47,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 తగ్గి, తులం రూ.51,380గా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు రూ.400 తగ్గి, 1కేజీ రూ.63,300గా ఉంది.నేడు (2 ఆగస్టు 2022, మంగళవారం) దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి, తులం (10 గ్రాములు) రూ.47,100 అయింది.