నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్‌గా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర కత్తి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్ గౌడ్ కి జీవన్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ రెబల్ గా కల్లెడ సర్పంచ్ గా ప్రసాద్ భార్య లావణ్య గెలుపొందారు. అయితే ఓడిపోయిన వాళ్లకు మద్దతు ఇవ్వడం , బిల్లులు ఆపించడం తో ఇద్దరి మధ్య వివాదాలు మొదలైనవి. జీవన్‌రెడ్డిని ప్రసాద్‌గౌడ్ పక్కాగానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
- Advertisment -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -