end
=
Saturday, February 22, 2025
సినీమాకాజల్ రీ ఎంట్రీ
- Advertisment -

కాజల్ రీ ఎంట్రీ

- Advertisment -
- Advertisment -

పరిచయం అవసరంలేని చందమామ కాజల్. ఈమె 2007లో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. మగధీర తో అభిమానులని సొంతం చేసుకుంది. తెలుగు, త‌మిళ‌, బాలీవుడ్ ప్రేక్షకుల‌ను అలరిస్తూ వ‌చ్చిన బ్యూటీ డాల్ కాజ‌ల్ అగ‌ర్వాల్. కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూరంటూ ఉంటూ వ‌చ్చింది. ఇది ఓ ర‌కంగా ఆమె అభిమానుల‌కు బాధ‌ను క‌లిగించింది. సినీ ఎంట్రీ గురించి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎప్పుడు ఎక్కడా పెదవి విప్పలేదు. అస‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాల్లో న‌టిస్తుందా లేదా! అనే సందేహం కూడా వచ్చింది. ఈ నేప‌థ్యంలో రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ త‌న రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన క్రేజీ ప్రాజెక్ట్ ఇండియ‌న్ 2. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న చిత్రమిది. త‌ర్వాత కొవిడ్ కారణంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదా ప‌డుతూ వచ్చింది. ఇండియ‌న్ 2 సినిమాను పూర్తి చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని కాజల్ అగ‌ర్వాల్ స్వయంగా తెలియ‌జేసింది. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఇండియ‌న్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నట్లు కాజ‌ల్ అగ‌ర్వాల్ చెప్పేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -