end
=
Saturday, November 23, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంFenugreek: మెంతులతో ఎన్నో ప్రయోజనాలు
- Advertisment -

Fenugreek: మెంతులతో ఎన్నో ప్రయోజనాలు

- Advertisment -
- Advertisment -

Fenugreek: మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ(Methi) అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. మెంతులు వంటకాల రుచిని పెంచటానికే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఫోలిక్‌ యాసిడ్‌(Folic Acid), రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌తో పాటు విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి పోషాకలు పుష్కలంగా ఉన్నాయి. మెంతులు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని నానబెట్టి తీసుకుంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాట్‌ టూ స్లిమ్‌ డైరెక్టర్‌, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ శిఖా అగర్వాల్ శర్మ నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్పారు. అవి ఏంటో తెల్సుకుందాం

(Olive Oil: ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?)

మీరు గ్యాస్‌, ఎసిడిటీ(Acidity), కడుపు ఉబ్బరం (Stomach bloating) వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మెంతులు(Fenugreek) మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి నానబెట్టిన మెంతులు తీసుకుంటే ఈ సమస్యలు దూరమవుతాయి. మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఎసిడిటీ దూరం అవుతుంది.మెంతులు తింటే మలబద్ధకం సమస్య నుండి తప్పించుకోవచ్చు. మెంతులు రక్తంలోని చక్కెర స్థాయులు(Blood Glucose Levels) నియంత్రించడంలో సహాయపడతాయి. షుగర్‌ పేషెంట్స్‌(Diabetic Patients) రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి ఖాళీ కడుపుతో నీటితో పాటు తీసుకుంటే మంచిది. షుగర్‌ ను కంట్రోల్ (Diabetic Control) చేస్తుంది. మొలకెత్తిన మెంతులు తీసుకుంటే ఇంకా మంచిది. వీటిలో 30-40 % ఎక్కువ పోషక గుణాలు ఉంటాయి. ఇలా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. దీనివల్ల గ్లూకోజ్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

(Thippa Theega : తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు)

మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్‌ అనే అమైనో ఆల్కనాయిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ (Insulin Generates) ఉత్పత్తిని పెంచుతుంది, కణాలు ఇన్సులిన్‌ను తీసుకునేలా చేస్తుంది. వీటిలో 2-ఆక్సోగ్లుటేట్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. కఫం ఎక్కువగా ఉన్నవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి, మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది. దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆస్తమా(Asthama), దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. మెంతులలో జీరో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే బరువును సులభంగా తగించుకోవచ్చు.

(Weight Loss : రెండు వారాల్లో 10 కిలోల బరువు తగ్గొచ్చు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -