end
=
Wednesday, November 20, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కి కోవిడ్ పాజిటివ్.!
- Advertisment -

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కి కోవిడ్ పాజిటివ్.!

- Advertisment -
- Advertisment -

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌కి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న రఘునందన్, కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను బాగానే వున్నాననీ, తనతో ఇటీవల కలసినవారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని రఘునందన్ కోరారు. ఇటీవలి కాలంలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగానే వుంది.సంఖ్యా పరంగా, అయితే, గతంతో పోల్చితే కోవిడ్ బారిన పడినవారికి తీవ్ర లక్షణాలేమీ వుండటంలేదు. ఎక్కువ అనారోగ్య సమస్యలూ రావడంలేదు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులూ కోవిడ్ బారిన పడుతున్నారు. అయితే, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం చాలా చాలా తక్కువగా వుంటున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చాలావరకు పూర్తవడంతోనే, కోవిడ్ వల్ల ఇబ్బందులు తగ్గుతున్నాయి.ఇదిలా వుంటే, రఘునందన్ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో వుండేవారు. అయితే, కేసీయార్ తీరు నచ్చక ఆయన బయటకు వచ్చారు. బీజేపీలో చేరి, దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసి విక్టరీ అందుకున్నారు. న్యాయవాదిగానూ రఘునందన్ సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమంలో రఘునందన్ తనదైన కీలక పాత్ర పోషించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -