end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌రాఖీ పౌర్ణమి విశిష్టత
- Advertisment -

రాఖీ పౌర్ణమి విశిష్టత

- Advertisment -
- Advertisment -

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ. రాఖీ పండుగ వెనక ఉన్న రహస్యాలేంటి కథలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షా బంధన్ లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం(రక్షా బంధన్) కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ వారు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలని ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి, వారి నుదుట మీద కుంకుమ పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను అడిగిమరి ఇస్తారు.

పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణు దేవుడు ఆ రాక్షసి నాశనం చేస్తాడు. అప్పటినుంచి ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -