దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. డిల్లీ, ముంబయి కొత్త కేసులు పెరగడం మనం గమనించవచ్చు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,754 మందికి కరోనా వైరస్ సోకినట్లు, 47 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. డిల్లీ లో 1,964 మంది వైరస్ బారిన పడ్డారు. ముంబయి లో 1,201 కేసులు రాగా ఆగష్టు లో ఇవే అత్యధికం. మహారాష్ట్ర లో 2,246 మంది కి కరోన సోకింది. దేశంలో నిన్న 15,220 మంది కరోన నుండి బయటపడ్డారు. ఎప్పటివరకు 209 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేయబడ్డాయి. నిన్న ఒకరోజులో 31.5 లక్షల మంది టీకా వెపించుకున్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు తెలిపారు.