- ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదంటే నేను రాజీనామాకు సిద్దం.
- ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తరా…
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి మంత్రి హరీశ్ రావు సవాల్..
- కేంద్ర మంత్రులది పార్లమెంట్ లో ఓ మాట…గల్లీలో ఓమాట
- బీజేపీ చేప్పేవి అర్థసత్యాలు…మేం చెప్పేవి నగ్న సత్యాలు.
- దేశాన్ని దివాళా తీయంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది.
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు ఫైర్.
2001 లోనే ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) తెలంగాణలో చేరిందన్నారు మంత్రి. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరిందని లోక్సభలో కేంద్రమంత్రి చెప్పారని తెలిపారు. నిన్న కామారెడ్డిలో నిర్మల సీతారామన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ కంటే మంచి పథకం తెలంగాణలో ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరితోందని ఆరోగ్యశ్రీ(Arogyasri)తో 90 లక్షల మందికి తెలంగాణలో లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు మంత్రి హరీష్‌రావు(Harish Rao). అలాంటప్పుడు తెలంగాణకు ఆయుష్మాన్ భారత్ కింద 150 కోట్లు నిధులను ఎందుకు విడుదల చేశారో మంత్రి నిర్మలా ఎలైనా సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని మంత్రి అధికారికంగా చెప్తే తాను రాజీనామా(Resignation )చేయడానికి సిద్ధమన్నారు మంత్రి హరీష్‌రావు.. నిర్మల సీతారామన్ పట్టపగలు అబద్ధాలు చెబుతున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు.
(బీజేపీ మాటలు తప్ప పని చేయదు..)
దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు మంత్రి హరీష్‌రావు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే..రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చిన నిధుల వాటా అత్యధికమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 3లక్షల కోట్లకుపైగా నిధులను కేంద్రానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి అన్నారు మంత్రి హరీష్‌రావు. అలాంటప్పుడు సీఎం కేసీఆర్(CM KCR) ఫోటోను కేంద్రమే పెట్టుకోవాలని సూచించారు. నిర్మలా సీతారామన్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు మంత్రి హరీష్‌రావు.
అసల్ బీమా అమలు కావడంలేదని అడిగారు నిర్మలా సీతారామన్. ప్రదాన స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు కావడం లేదో ముందు సమాధానం చెప్పి, మమ్ముల్ని అడగాలి. అది దండగ, రైతులకు మేలు జరగదని గుజరాత్ రాష్ట్రమే తిరస్కరించింది. కట్టేది ఎక్కువ…వచ్చేది తక్కువ అని. దీని సమాధానం ఇవ్వాలి.నేను ప్రతీప్రశ్నకు ఆన్సర్ ఇచ్చా…నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వమనండి. నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) గారిని. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నరు. తెలంగాణకు కేంద్ర మంత్రులు రావడం అబద్దాలు మాట్లాడటం. పార్లమెంట్ లోనిజాయితీగా చెప్తరు. గల్లీలో అబద్దాలు మాట్లాడతరు. స్థాయిని దిగజార్చుకోని మాట్లవద్దని నా సూచన.