- కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై అంసెబ్లీలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ర్టంలో బంగారు స్మగ్లింగ్ మాఫీయా రెచ్చిపోతుందని, ఏకంగా సీఎం కార్యాలయాన్ని అడ్డాగా మార్చారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలా గట్టిగా తన వాదననను వినిపించారు. ఈ బంగారం స్మగ్లింగ్ కేసులో స్పీకర్‌కు కూడా సంబంధాలున్నాయని, అసలు స్పీకర్ ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని విమర్శించారు. అవిశ్వాస తీర్మాణానికి14 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని స్పీకర్ తెలియజేశారు. అప్పుడు మాత్రమే సమ్మతిస్తానని స్పీకర్ చెప్పారు.

త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, పర్యవేక్షణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్షించాలని కోరుతూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగింది.