అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను తెలంగాణ విద్యాశాఖ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు శుభవార్త. ఈ సంవత్సరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు (Dasara) తెలంగాణలో సెలవులు భారీగా రానున్నాయి. ఈ నవరాత్రి వేడుకల్లో వేరు వేరు అలంకారాల్లో అమ్మవారి దర్శనం కనిపిస్తుంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 09 వరకు దసరా సెలవులు 13 రోజులు అధికారంగా ప్రకటించారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లకు ముందుగానే హాలీడేస్(Holidays) మంజూరు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు(Educational institutions) తిరిగి ప్రారంభం కానున్నాయి.
(దసరా వేడుకలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి…)