ఇప్పుడు మనం తెల్సుకోబోతున్న విషయం గురించి వింటే నివ్వెరపోతారు. ఈ ఘటన గుజరాత్‌లోని వదోదరలో చోటుచేసుకుంది. ఓ మహిళ(అమ్మామ్మ) తన భర్త లైంగిక వేధింపులకు(Sexual harassment) తట్టుకోలేక హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. తాత వయసు 89 ఏళ్ల అయినా తరుచుగా తన కోరికలను తీర్చాలని ఇబ్బంది పెడుతున్నాడని, అనారోగ్యానికి గురై మంచానపడి నిస్సహాయ స్థితి లో ఉన్న వదిలిపెట్టడం లేదని బాధితురాలు వాయిపోయింది. తన కోరిక తీర్చకపోతే ఇళ్లంతా రణరంగంగా మారిపోతుందని, పెద్దగా అరుస్తూ గొడవ గొడవ చేస్తున్నాడని తన బాదను వెళ్లబోసుకుంది. చుట్టూ పక్కన ఉండే వాళ్లు కూడా అరుపులకు భయపడిపోతున్నారని చెప్పింది.శృంగారం(Romance) కోసం 89 ఏళ్ల తన భర్త పెడుతున్న పోరును తట్టుకోలేకపోతున్నానంటూ ఓ 87 ఏళ్ల వృద్ధురాలు హెల్ప్‌లైన్‌ను సహాయం కోరింది. దీనిపై స్పందించిన హెల్ప్‌లైన్ బృందం ఆ వృద్ధ దంపతులకు యోగా చేయడం వల్ల పరిష్కారం ఉంటుంది అని వివరించారు. దీని తర్వాత అలా చేయడం వల్ల ఆ వృద్ధురాలికి భర్త నుంచి వేధింపులు తగ్గాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ‘181 అభయం’ (181 Abhayam)పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్(Help line)ను ఏర్పాటుచేసింది. దీని ద్వారా మహిళల సమస్యలకు పరిష్కారం అందిస్తున్నారు. ఇటీవల వడోదరకు చెందిన ఓ వృద్ధురాలు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. ఈ వయసులోనూ సెక్స్ కోసం తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, దాన్ని నిరాకరిస్తున్న తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని వాపోయింది. దీంతో ‘అభయం’ బృందం ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుని వాళ్ళకి అర్దం అయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చింది. యోగా(Yoga), ధాన్యంపై దృష్టి పెట్టాలని మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ఆ వృద్ధుడికి సూచించింది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం ఆయనను సెక్సాలజిస్ట్‌కు చూపించాలని కుటుంబసభ్యులకు సూచించామని తెలిపారు.