మానవులు సరదా కోసమో లేక స్వీయ సంతృప్తి (self-satisfaction) కోసమో చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటీవల వెస్ట్ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చింది. లైంగిక కోరికలతో తచ్చాడుతున్న ఓ 27ఏళ్ల యువకుడు అనాలోచిత చర్యకు పాల్పడి ఆస్పత్రిపాలైన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ మేరకు ఓ వ్యక్తి గత మూడు వారాలకింద (3 weeks) మలద్వారం నుంచి 8 అంగుళాల (8-inch) డియోడరెంట్ (deodorant) డబ్బాను తోచుకుని తీవ్ర ఇబ్బందుల పాలయ్యాడు. అయితే అది పెద్దపేగు గుండా 7½ అంగుళాలు లోపలికి వెళ్లడంతో బయటకు తీయలేక తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. దాదాపు 20 రోజులపాటు ప్రయత్నించి విపరీతమైన కడుపునొప్పికి గురైన బాధితుడు చివరికి డాక్టర్లను సంప్రదించాడు. దీంతో ఈ వార్త విన్న ‘బుర్ద్వాన్ మెడికల్ ఆసుపత్రి’ (Burdwan Medical College’s hospital) వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిపింది. అయితే ఎట్టకేలకు ఆ డబ్బాను బయటకు తీసిన డాక్టర్లు (doctors) ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ.. ‘దీన్ని తొలగించడం పెద్ద సవాలుగా మారింది. సదరు వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటూ రెండు గంటల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. విపరీతమైన దుర్వాసన మమ్మల్ని ఊపిరాడకుండా చేసింది. మలద్వారంగుండా వెళ్లిన డబ్బా యాంటిపెర్సిపిరెంట్‌ను (antiperspirant) చీల్చివేసింది. యువకుడు సరైన సమయంలో ఆసుపత్రికి రాకపోతే జీవితం ప్రమాదంలో పడేది’ అంటూ ఓ ప్రముఖ చానెల్‌కు వివరించారు.
అయితే దురదృష్టవశాత్తు ఈ ఆపరేషన్ నుంచి రోగి క్షేమంగా బయటపడలేదన్న డాక్టర్లు.. అతని అన్నవాహిక, ప్రేగులు రెండింటికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అంతేకాదు ఈ గాయం కారణంగా ఆతనికి భవిష్యత్తులోనూ శస్త్రచికిత్స అవసరం కావచ్చని, ముందుముందు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ఇక మరో ఏడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని పేర్కొనగా.. ఈ ఇష్యూపై స్పందించిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు.. ‘ఆసుపత్రి అందించిన చికిత్సతో సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణంగా ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. కానీ, ‘బుర్ద్వాన్ మెడికల్ ఆసుపత్రి’ చాలా త్వరగా స్పందించి మా అబ్బాయి ప్రాణాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. కాగా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాకపోగా.. ఏప్రిల్‌లో ఒక బ్రెజిలియన్ (Brazilian) వ్యక్తి వెనుకనుంచి డంబెల్‌ను నెట్టుకోవడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.