టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఇటీవల పూరిజగన్నాథ్ (Puri Jagannath)డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ (Liger) సినిమాకోసం చేసిన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బాక్సింగ్ లెజెండ్ ‘మైక్ టైసన్’ (Mike Tyson) సినియర్ నటి రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ అనన్యపాండే కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా బాక్సింగ్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విజయ్.. మళ్లీ తన అభిమానుల్లో స్పూర్తినింపే వ్యాఖ్యలతో నెట్టింట దర్శనమిచ్చాడు.
(స్నేహమే శాశ్వతం అంటున్న పూరీ)
ఈ మేరకు ‘కష్టపడి పనిచేయండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. కొత్త నైపుణ్యాలు నెర్చుకోండి. తప్పుల నుంచి బయటపడండి. విజయాన్ని ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సిన జీవితాన్ని గడపేయండి’ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇక ఈ క్యాప్షన్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఎట్టకేలకు విజయ్ నేలమీదకు దిగొచ్చాడు. తాతలు, తండ్రులు అంటూ గప్పలు కొట్టి అట్టర్ ప్లాఫ్ అంటగట్టుకున్నాడు. ఇప్పటికైనా నిజం తెలుసుకుని రియలైజ్ అయినందుకు సంతోషిస్తున్నాం. తప్పులను గుర్తించి విజయంవైపు అడుగులు వేస్తావని ఆశిస్తున్నాం’ అంటూ హీరో పోస్ట్‌కు రిప్లై ఇస్తున్నారు.
నిజానికి ఈ సినిమాకోసం విజయ్ చాలానే కష్టపడ్డప్పటికీ అనుకున్న ఫలితం రాలేదు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (Martial Arts) నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక చివరగా విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమాలో నటిస్తుండగా సమంత హీరోయిన్గా కనిపించనుంది.
(ముగ్గురితో కలిసి సెక్సులో పాల్గోడానికి అభ్యంతరం లేదన్న విజయ్)