- పూర్తి ఫిట్‌నెస్‌తో వస్తున్నాడన్న సూర్యకుమార్ యాదవ్
- కంగారుల భరతం పడాతాడంటున్న ఇండియన్ ఫ్యాన్స్
స్టార్ ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah).. గాయల కారణంగా గత కొద్దికాలంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. కాగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య రెండో టీ20 (T20) మ్యాచ్‌కు (Match) అందుబాటులోకి వస్తున్నట్లు మెనేజ్‌మెంట్ (management) అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (suryakumar) ప్రెస్ మీట్‌లో వెల్లడించాడు

ఈ మేరకు గురువారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ (Press conference)లో బుమ్రా ఫిట్‌నెస్ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రశ్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేదా ఫిజియోని అడగాలి. బుమ్రా ఆరోగ్యం, ఫిట్‌నెస్ (fitness)పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో టీ20లో బుమ్రా జట్టులో చేరేందుకు సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం జట్టులో వాతావరణం చాలా బాగుంది. అందరూ ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు. అలాగే రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తను ఫిట్‌గానే ఉన్నాడు.’ అని పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోయింది. డెత్ (death overs)ఓవర్లలో అధికంగా పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పకపోగా.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రాణించకపోవడంతో బుమ్రా రంగంలోకి దిగబోతున్నాడు.
ఇక ఈ నాగ్‌పూర్ (Nagpur) వేదికగా 2019లో బంగ్లాదేశ్ (Bangladesh) తో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ ఆడగా.. భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే 2017 జనవరిలో ఇంగ్లండ్ (England)తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. మొత్తంగా నాగ్‌పూర్‌లో 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్‌లు గెలిచి, శ్రీలంక, (Sri Lanka) న్యూజిలాండ్ (New Zealand)ల చేతిలో 2 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొంది. ఇక శుక్రవారం రాత్రి 7:00 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలించేటట్లు లేదని తెలుస్తుండగా.. చిరుజల్లులతో మొదలై భారీ వర్షం (Rain)పడే అవకాశం ఉందని, దీంతో టాస్ (Toss) పై మంచు ప్రభావం చూపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.