బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) మరోసారి సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల వరుసగా ఇండస్ట్రీ (industry) లొసుగులపై పెదవి విప్పుతున్న ఆమె తాజాగా తనను విషంపెట్టి చంపేసేందుకు పలుమార్లు ప్రయత్నించారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు లైంగిక వేధింపుల గురించి మాట్లాడినందుకు తన కారు బ్రేకులు (break) తీసేసి వివిధ మార్గాల్లో చంపేయాలని ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఓ సారి ప్రమాదానికి గురయ్యానన్న ఆమె తీవ్రమైన రక్తస్రావం అయిందని, దేవుని దయతో ప్రాణాలతో బయటపడి కోలుకున్నట్లు చెప్పింది.
అయితే కొన్ని నెలల క్రితం తన ఇంట్లో పనిమనిషి ఆనారోగ్యానికి గురవగా ఆమె స్థానంలో వచ్చిన మహిళా తనకిచ్చే నీటిలో (water)ఏదో కలుపుతున్నట్లు గుర్తించానన్న నటి.. ‘నాకు ఏదైనా జరిగితే బాలీవుడ్ మాఫియా (bollywood mafia)స్నేహితుడైనా నానా పటేకర్ (Nanapatekar)మొదటి నిందితుడు. ఈ విషయాన్ని లాయర్లకు, సహచరులకు, నాలాంటి బాధ్యులకి తెలియజేయండి. పలు మరణాల కేసుల్లో వారి పేర్లు తరచుగా వినిపించిన విషయాన్ని గమనించండి. అలాంటి వారి సినిమాలను చూడకండి. వాటిని పూర్తిగా బహిష్కరించండి. దుర్మార్గులను ప్రతీకారంతో వెంబడించి తరిమికొట్టండి. నా గురించి నకిలీ వార్తలు (fake news) రాసిన వారందిరనీ నిందించండి. నన్ను వేధించినందుకు వారి జీవితాలను నరకయాతన చేయండి. చట్టం, న్యాయం నన్ను రక్షించకపోవచ్చు. కానీ, ఈ గొప్ప దేశ ప్రజలు (Indian people) నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది. జై హింద్.. బై! ఫిర్ మిలేంగే’ అంటూ తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.
ఇక ‘మీటూ’ (Mee To)ఉద్యమం ద్వారా ఈ భామ బయటపెట్టిన లైంగిక వేధింపుల ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. క్యాస్టింగ్ కౌచ్ (casting couch) ఆరోపణల కారణంగా నానాపటేకర్‌ను ‘హౌస్‌ఫుల్3’ (HOUSEFULL 3) సినిమాతో పాటు మరికొన్ని సినిమాల నుంచి తొలగించారు. అయితే జూన్ 2019లో అతనికి ఈ కేసు విషయంలో కోర్టు నుంచి క్లీన్‌చీట్ (Clean cheat)వచ్చింది. చివరగా తనుశ్రీ ‘ఆషిక్ బనాయా ఆప్నే’ అంటూ భారీ గుర్తింపు తెచ్చుకోగా తెలుగులో బాలయ్యతో ‘వీరభద్ర’ సినిమాలో నటించి మెప్పించింది.