end
=
Monday, January 20, 2025
క్రీడలుT20 World Cup: బౌలర్లు.. అతడితో జాగ్రత్త
- Advertisment -

T20 World Cup: బౌలర్లు.. అతడితో జాగ్రత్త

- Advertisment -
- Advertisment -
  • ఈ ప్రపంచకప్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ సూర్యనే
  • అతడి బ్యాటింగ్ నైపుణ్యానికి బౌలర్ల అటాక్ సరిపోవట్లేదు
  • అందరికీ ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తున్నాడు
  • ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసలు

T20 World Cup: ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup) ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్‌కు సెలక్ట్ అయిన ప్లేయర్లు తీవ్రంగా నెట్‌లో శ్రమిస్తున్నారు. మరికొంతమంది తుది జట్టులో చోటు పదిలం చేసుకోవడం కోసం ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ల్లో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోగా.. ఈసారి టోర్నీ తమ స్వదేశంలో జరగబోతుండగా మరింత ఆత్మ విశ్వాసంతో ఉన్నారు ఆసిస్ ప్లేయర్లు. అయితే రీసెంట్‌గా భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దాదాపు గెలిచినంత పనిచేసిన ఆస్ట్రేలియా(Australia) తృటిలో మిస్ చేసుకుంది. ఈ మేరకు తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన ఆసిస్ కోచ్ ఆండ్రూ.. భారతీయ ప్లేయర్లపై ప్రశంసలు కురిపించగా సూర్య కుమార్‌(Surya Kumar)ను మోస్ట్ డేంజర్ అంటూ ఆకాశానికెత్తేశాడు.

(Abhijith : 22 ఏళ్లకే గుండెపోటు..)

ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఈ ప్రపంచకప్‌లో చాలా ప్రమాదకరంగా మారబోతున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా-ఇండియా(Australia-India) మూడో టీ20 అనంతరం మెక్‌డొనాల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తూ.. ‘ఆస్ట్రేలియా-భారత్ మూడో టీ20లో సూర్యకుమార్ 69 పరుగులు చేశాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఇవి భారత విజయానికి కీలకంగా మారాయి. భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ డేంజరస్(Dangerous) ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.

(Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ)

అలాగే ఈ సిరీస్‌(Series)లో రవీంద్ర జడేజా లేకపోవడంతో భారత్‌కు పెద్ద మైనస్‌గా భావించానన్న ఆయన.. ‘అతడు లేని లోటును అక్షర్ పటేల్(Akshar Patel) భర్తీ చేశాడు. ఈ సిరీస్‌లో 8 వికెట్లు తీసి ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. భారత బ్యాటర్ల నైపుణ్యానికి ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ సరిపోనట్లుగా కనిపించింది. డెత్ బౌలింగ్‌లో మా జట్టు మెరుగ్గా కనిపించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేశాం. వాటికి సంబంధించిన ఫలితాలనూ చూశాం. ఈ ఫలితాలు మాకు ప్రపంచకప్‌కు ఉపయోగపడవచ్చు. అయితే మేము ఈ సిరీస్ మొత్తం హార్దిక్‌ పాండ్యాపైనే ఫోకస్ చేశాం. కానీ సూర్యకుమార్ యాదవ్ ఇలా అదరగొడతాడని ఊహించలేదు. ఈ మ్యాచ్‌తో అతనేంటో ప్రూవ్ చేశాడు.’ అని వివరించాడు.

(Dussehra: దసరా వేడుకలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -