end
=
Sunday, November 24, 2024
సినీమాSaniya Ayyappan : అభిమాని చెంప పగలగొట్టిన నటి..
- Advertisment -

Saniya Ayyappan : అభిమాని చెంప పగలగొట్టిన నటి..

- Advertisment -
- Advertisment -

మలయాళ నటీమణులు సానియా (Saniya Ayyappan) అయ్యప్పన్, గ్రేస్ ఆంటోనీ ( Grace Antony)లకు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరూ నటించిన తాజా మూవీ ( ‘Saturday Night’) ‘సాటర్డే నైట్’. కాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో(Movie Promotions) భాగంగా కేరళలోని కాలికట్ (కోజికోడ్)లో హైలైట్‏ మాల్‏ ఓపెనింగ్స్‏కు వెళ్లగా.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపిస్తూ లైంగిక వేధింపులకు (sexually harassed) గురిచేశారు. సెల్ఫీ అంటూ దగ్గరకు తొసుకుని వస్తూ వెకిలి చేష్టలు చేశారు. అంతేకాదు ఓ అబ్బాయి డైరెక్ట్ సానియా ఒంటిపై చేయి వేయడంతో కోపంతో రగిలిపోయిన ఆమె అతడిని లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

(Tanushree Dutta:పని మనిషితోనే నన్ను చంపించాలని చూశారు..)

అయితే తమకు ఎదురైన ఊహించని ఎక్స్‌పీరియన్స్ గురించిన వీడియోను సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేసిన సానియా.. భావోద్వేగానికి లోనైంది. ‘కేరళలోని కాలికట్ కోజికోడ్ (Kozhikode mall)లో హైలైట్‏ మాల్‏లో(Highlight Mall) నిర్వహించిన కార్యక్రమానికి చిత్రయూనిట్‌తోపాటు ఆంటోనీ నేను వెళ్లాం. దీంతో మమ్మల్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం మేము బటకు వస్తున్న క్రమంలో ఫ్యాన్స్ (Fans) అత్యుత్సాహంతో మా వెంట కదిలారు. ఈ క్రమంలోనే అందులో కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తే.. మరొక వ్యక్తి ఏకంగా నా ఒంటిపై చేయి వేసి తాకరానిచోట తాకాలని చూశాడు. దీంతో ఒక్కక్షణం షాక్ అయిన నేను వెంటనే తెరుకుని అతడి చెంప పగలగొట్టాను’ అంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది.

అలాగే తమ సినిమా ప్రమోషన్స్ (promotions) ఈవెంట్లు అన్నిచోట్లా బాగా జరిగాయన్న నటి.. ఈ వేడుకకు ఊహించని స్థాయిలో అభిమానులు రావడం ఆనందంగా ఉందని, కాలికట్ ప్రజలు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. ఇక మాల్ మొత్తం జనంతో నిండిపోవడం చూస్తే కన్నుల పండుగగా అనిపించిందన్న సానియా.. ప్రేక్షకులను అదుపు చేసేందుకు సెక్యూరిటీ సైతం చాలా కష్టపడ్డట్లు తెలిపింది.  చివరగా ఎక్కువ మంది ఉండడంతో తనను తాకిన వాడిని గుర్తించలేకపోయామన్న ఆమె.. అందువల్ల అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయికి రాకూడని కోరుకుంటున్నానని, స్త్రీలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -