end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Forest Walk :అడవిలో 60 నిమిషాలు నడిస్తే మెదడులో అద్భుతం..
- Advertisment -

Forest Walk :అడవిలో 60 నిమిషాలు నడిస్తే మెదడులో అద్భుతం..

- Advertisment -
- Advertisment -

Forest Walk : ఈ రోజుల్లో మనిషి జీవనశైలీ (Life Style) రోజురోజుకు పూర్తిగా మారిపోతుంది. నిరంతరం శారీరక శ్రమకు(Physical Workout) దూరంగా ఉంటూ సుఖవంతమైన జీవితాన్ని గడిపేందుకు బాటలు వేసుకుంటున్నాడు. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు కొత్త రకమైన ఆవాసాలను సూచిస్తాయి. విలాసవంతమైన వసతులను అందిస్తాయి. కానీ ఇవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని.. పట్టణ పరిసరాలతో ఆందోళన, డిప్రెషన్‌ (depression) సహా ఇతరత్రా మానసిక ఆరోగ్య సమస్యలు(Mental Health Problems) తలెత్తే ప్రమాదంతో అనుసంధానించబడ్డాయని తాజా పరిశోధన (Research) వెల్లడించింది. అంతేకాదు ప్రకృతిలో (Nature) కొద్దిసమయం గడపడం మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తేల్చింది. రక్తపోటు(Blood Pressure), ఆందోళన(Anxiety), నిరాశను తగ్గించి మానసిక స్థితి, దృష్టి, నిద్రతోపాటు(Well Sleep) జ్ఞాపకశక్తిని(Memory Power) మెరుగుపరుస్తుందని పలు రిసెర్చ్‌ల్లో వెల్లడైంది.

(Walking Benefits : వాకింగ్ వల్ల ప్రయోజనాలు)

నిజానికి అడవిలో నడవడం (Walking in Forest) వల్ల మెదడులో ఇన్ని ప్రయోజనకర మార్పులను ప్రేరేపించగలదా? లేదా? అనేది ‘అమిగ్డాలా’(amygdala) (మెదుడులో భావోద్వేగ ప్రక్రియలతో సంబంధం కలిగిన భాగం) ద్వారా తెలుసుకోవచ్చు. ఒత్తిడి సమయంలో నగరవాసులతో పోలిస్తే గ్రామీణుల్లో అమిగ్డాలా తక్కువగా యాక్టివేట్ (Activate) చేయబడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే గ్రామీణ జీవనం వల్లే ఈ ప్రభావం ఉంటుందని కాదు కానీ సహజంగా ఈ లక్షణాన్ని కలిగిన వ్యక్తులు పట్టణంలో నివసించే అవకాశం ఉంది. కాగా ఇదే అంశంపై ‘మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రీసెర్చర్స్.. ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్’ (FMRI) సాయంతో కొత్త అధ్యయనం చేపట్టగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ మేరకు 63 మంది ఆరోగ్యవంతమైన అడల్ట్ వలంటీర్స్‌పైన (Adult volunteers) ‘వర్కింగ్ మెమొరీ టాస్క్‌’ (Working Memory Task) నిర్వహించిన పరిశోధకులు.. తాము అడిగిన ప్రశ్నలకు పార్టిసిపెంట్స్ ఆన్సర్ (Participants answer) చేసేటపుడు FMRI స్కాన్ (Scan) చేశారు. ఇది MRI, నడకకు సంబంధించిన ప్రయోగమని పాల్గొన్నవారికి చెప్పారే గానీ పరిశోధన లక్ష్యం గురించి వారికి తెలియదు. కానీ, కొంతమందిని పట్టణ వాతావరణంలో లేదా సహజమైన ఫారెస్ట్ ఏరియాలో (Forest area) ఒక గంట నడిపించారు. ఈ సందర్భంగా మొబైల్స్ ఫోన్స్‌ (Mobile phones) ఉపయోగించనివ్వలేదు. ఆ తర్వాత MRI స్కాన్స్‌లో.. అడవుల్లో నడిచిన(Walking) తర్వాత అమిగ్డాలాలో యాక్టివిటీ తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. కాగా ఒత్తిడితో కూడిన మెదడు ప్రాంతాల్లో ప్రకృతి ప్రయోజనకరమైన ప్రభావాలను ప్రేరేపిస్తుందనే ఆలోచనకు ఇది మద్దతు ఇస్తుంది. అంతేకాదు కేవలం 60 నిమిషాల్లోనే ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుందని పరిశోధకులు రుజువు చేశారు.

(Knee Pains:మోకాళ్ల నొప్పుల తో బాదపడుతున్నారా…)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -