- పబ్లిక్ రూమర్స్‌కు చెక్‌పెట్టేందుకే ఈ ప్రయత్నం
- అందమైన ప్రేమ కథ తెరకెక్కనున్నట్లు సమాచారం
టాలీవుడ్ నటులు నరేష్ (Naresh), పవిత్రల (Pavitra) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నరేష్ లైఫ్‌లోకి పవిత్ర ఎంట్రీ అయినప్పటి నుంచే ఆయన ఫ్యామిలీలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని అటు టాలీవుడ్(Tollywood), ఇటు సోషల్ మీడియాలో (Social media) ప్రచారం నడుస్తోంది. అంతేకాదు కొంతకాలంగా నరేష్, పవిత్రలపై విపరీతమైన ట్రోల్స్ (Trolls) వైరల్ అవుతున్నాయి. దీంతో ఎలాగైనా వీటికి చెక్ పెట్టాలని భావించి తమ సంబంధంపై ఓ క్లారిటీ ఇవ్వాలనుకున్నారట. అయితే అది నరేష్, పవిత్ర జీవిత గాథల ఆధారంగా ఓ అందమైన ప్రేమ కథ తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో తమ సహజీవనంపై క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగని ఇది వీళ్లిద్దరి బయోపిక్ (Biopic) మాత్రం కాదు.. పబ్లిక్ రూమర్స్‌కు చెక్‌పెట్టడానికి సోషల్‌మీడియాకు క్లారిటీ కంటెంట్ (Clarity content) ఇవ్వడానికి ఫిక్సయ్యారట.
వీరిద్దరి సహజీవనాన్నే సినిమాగా చూపించబోతున్నారని, అందులో కొంత ఫిక్షన్ (Fixan)ను కూడా జోడించనున్నట్లు సమాచారం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. అయితేనేం ఈ మాత్రం ఉప్పందితే ఉప్పెనే కదా.. అసలు తమ జీవితాల్లో ఏం జరిగింది? ఎలా కలిశారు? ఎందుకు సహజీనం చేస్తున్నారన్న వివరాలను అందులో చెబుతారట. తమ ప్రేమ బంధంపై మంచి లవ్ స్టోరీ (Love story) మూవీతో అందరి నోళ్లు మూయిస్తామంటున్నారని టాక్.
ఇదిలావుంటే.. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు (Websites, YouTube channels) తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసు (Cyber crime police) లను ఆశ్రయించారు. సీనియర్ నటుడు నరేష్‌తోపాటు తన పట్ల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూ్బ్ ఛానెల్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇద్దరి ఫోటోస్ మార్ఫింగ్ (Morphing photos) చేసి.. అభ్యంతరకర కామెంట్లతో వాటిని వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇద్దరిని ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు (Case file)నమోదు చేసుకున్నారు.
గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ పై ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి (Marriage) కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదే అంశం గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ పై ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ గురించి వస్తున్న వార్తలపై పవిత్రా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్స్ (Fake account) క్రియేట్ చేసి తమకు ఇబ్బంది కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని గతంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశ పూర్వక రాతలను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్ర ఫిర్యాదుతో ట్రోలర్స్‌పై ఆరా తీస్తున్నారు పోలీసులు. కాగా వీరిద్దరి గొడవ ఇంకెక్కడికి దారితీస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.