end

Hair:3కిలోల జుట్టు తినేసిన బాలిక

  • పికా డిసీజ్ వల్లే ఇలా చేసిందన్న వైద్యులు


చిన్న పిల్లలకు (Childrens) ఎక్కువగా తినకూడని వస్తువులను తినాలనే అసాధారణ కోరిక (desire) అధికంగా ఉంటుంది. ఈ కోరిక కారణంగా చాలామంది పిల్లలు కాగితాలు (Papers), మట్టి (soil), ఇతర చెడు ఆహారేతర వస్తువులను తినాలని ఆసక్తిగా ఉంటారు. అయితే అలాంటి కోరిక పికా (Pica) (తినకూడని వస్తువులను బలవంతంగా తినడం) అనే వ్యాధికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం అలాంటి వ్యాధి కారణంగా చైనాకు (China) చెందిన ఓ టీనేజన్ (Girl) సుమారు 3కేజీల (kg) జుట్టును (Hair) తిని అనారోగ్యపాలైంది.

చైనా షాంగ్సీ ప్రావిన్స్‌ (Shaanxi Province of China)కు చెందిన 14ఏళ్ల టీనేజర్ భోజనం చేయలేని స్థితిలో ఆమెను హాస్పిటల్‌లో (Hospital)చేర్పించగా.. ఆమె పికా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా ఆ అమ్మాయి ట్రైకోటిల్లోమానియా (Trichotillomania) అనే మానసిక ఆరోగ్య పరిస్థితితో కూడా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని కారణంగా బట్టతల అయ్యేంతవరకు ఆమె జుట్టును తింటూనే ఉంటుందని వైద్యులు తెలిపారు. ‘‘ఆమె భోజనం చేయలేక మా దగ్గరకు వచ్చింది. దీంతో చికిత్స నిర్వహించినపుడు మాకు చాలా ఆశ్చర్యమేసింది. ఆమె కడుపు చాలా వెంట్రుకలతో నిండిపోయింది. ఫుడ్ తినేందుకు కొంచెం కూడా ప్లేస్ లేదు, ఆమె పేగులు కూడా బ్లాక్ అయినట్లు మేము కనుగొన్నాము’’ అని ఆ బాలికకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ షి (Dr. Shi)చెప్పారు. అందుకు కారణం.. ‘‘చాలా ఏళ్లుగా ఆ బాలిక తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చని.. అందువల్లనే ఇలాంటి వ్యాధికి గురైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా సమయం గడపాలని ఆశిస్తున్నాను’’అని డాక్టర్ షి చెప్పారు.

(Telangana:కంటి వెలుగు కోసం రూ. 200 కోట్లు)

పికా అంటే ఏంటి? చైనీస్ పిల్లల్లోనే ఎందుకు:
తల్లిదండ్రులు ఉద్యోగం కోసం దూర ప్రాంతాలు వెళ్లిన తర్వాత చైనాలోని విస్తారమైన గ్రామీణ ప్రాంతాల్లోని మిలియన్ల కొద్ది పిల్లలు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు. కాగా చైనీస్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలోని దాదాపు 13 మిలియన్ల మంది గ్రామీణ పిల్లలను (Rural children) వారి తల్లిదండ్రులు వదిలివెళ్లారు. అందులో తొమ్మిదేళ్ల నిర్బంధ పాఠశాల విద్యను పొందుతున్న విద్యార్థులందరూ.. సాధారణంగా 6 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారేనని తెలిపారు. పికాతో బాధపడుతున్న పిల్లలు ఇటీవలి సంవత్సరాలలో చైనా వార్తల్లో ముఖ్యాంశాలుగా మారారని తెలిపారు. ఇక హెల్త్‌లైన్ ప్రకారం.. ఇలాంటి డిస్కార్డ్ (Discord) (రుగ్మత) ఉన్న పిల్లలు తీవ్రమైన పరిణామాలకు గురవుతారని.. అందులోని కొన్నింటిని సూచించింది.

  • లీడ్ పాయిజనింగ్ (Lead poisoning)
  • అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్)
  • పేగులు బ్లాక్ అవడం (Intestinal blockage)
  • ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదాలు ఉంటాయని తెలిపారు. అయితే ఇది తాత్కలికమే అయినప్పటికీ తీవ్రమైన దుష్ప్రభావాలను నివారించడంలో వైద్యులు సకాలంలో చికిత్సను సూచిస్తారు.

పికాకు కారణం?:
ఈ సమస్యకు ఒకే కారణం లేదని ఆరోగ్య నిపుణులు నమ్ముతారు. అయినప్పటికీ ఇనుము, జింక్ (Zink) వంటి ఖనిజాల లోపం ఈ పరిస్థితికి కారణమవుతుంది. దీంతో అసాధారణమైన కోరికలు శరీరంలో తక్కువ పోషక స్థాయిలను తిరిగి కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తుందనడానికి ఇదొక సంకేతం కావచ్చని నిపుణులు విశ్వసిస్తారు. అంతేకాకుండా స్కిజోఫ్రెనియా, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (Schizophrenia, obsessive-compulsive disorder) వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా పికాను ఒక కోపింగ్ మెకానిజమ్‌గా అభివృద్ధి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

(Covid:మళ్లీ విజృంభిస్తున్న కరోనా)

Exit mobile version